ప్రకాశం జిల్లాలో ప్రైవేటు బస్సు-లారీ ఢీ: ఒకరి మృతి.. కిలోమీటర్ మేర నిలిచిపోయిన వాహనాలు

30-06-2022 Thu 07:39
  • విజయవాడ నుంచి అనంతపురం వెళ్తున్న బస్సు
  • పూసలపాడు వద్ద లారీని ఢీకొట్టి బోల్తా 
  • తీవ్రంగా గాయపడిన మరో 20 మంది
Private bus collide to lorry in prakasam dist one dead
ప్రకాశం జిల్లాలో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. విజయవాడ నుంచి అనంతపురం వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బెస్తవారిపేట మండలం పూసలపాడు వద్ద లారీని ఢీకొట్టి బోల్తాపడింది. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జాతీయ రహదారిపై బస్సు అడ్డంగా పడిపోవడంతో రెండు వైపులా కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో క్రేన్‌ను తెప్పించిన పోలీసులు బస్సును తొలగిస్తున్నారు.