ఆగ‌స్టు 1 నుంచి తెలంగాణ ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు

29-06-2022 Wed 21:12
  • ఆగ‌స్టు 10న ముగియ‌నున్న ప‌రీక్ష‌లు
  • ఉద‌యం ఫ‌స్ట్ ఇయ‌ర్ స‌ప్లిమెంట‌రీ
  • మ‌ధ్యాహ్నం వేళ సెకండ్ ఇయ‌ర్ ప‌రీక్ష‌లు
intermediate supplementary exams will start from august 1st in telangana
తెలంగాణ‌లో ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌లైంది. ఆగ‌స్టు 1 నుంచి 10వ తేదీ వ‌ర‌కు స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేర‌కు తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను బుధ‌వారం విడుద‌ల చేసింది.

ఈ షెడ్యూల్ ప్ర‌కారం ఉద‌యం 9 గంట‌ల నుంచి మధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ఫ‌స్ట్ ఇయ‌ర్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి. అదే విధంగా మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల నుంచి సాయంత్రం 5.30 గంట‌ల వ‌రకు సెకండ్ ఇయ‌ర్ సప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి.