ముంబై నూత‌న పోలీస్ క‌మిష‌నర్‌గా వివేక్ ఫ‌ణ్‌షాల్క‌ర్ నియామ‌కం

29-06-2022 Wed 21:00
  • రేపు ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్న సంజ‌య్ పాండే
  • 1989 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన వివేక్‌
  • 2018 నుంచి థానే పోలీస్ క‌మిష‌నర్‌గా ప‌నిచేస్తున్న సీనియ‌ర్ ఐపీఎస్‌
1989 batch IPS officer Vivek Phansalkar is the mumbai new police commissioner
మ‌హారాష్ట్రలో నెల‌కొన్న రాజ‌కీయ సంక్షోభం కొనసాగుతున్న స‌మ‌యంలోనే ఆ రాష్ట్ర రాజ‌ధాని ముంబై పోలీస్ క‌మిష‌న‌ర్ మార్పు అనివార్యమైంది. ప్ర‌స్తుతం ముంబై పోలీస్ క‌మిష‌న‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంజ‌య్ పాండే గురువారం ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న స్థానంలో సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి వివేక్ ఫ‌ణ్‌షాల్క‌ర్ నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు మ‌హారాష్ట్ర ప్రభుత్వం బుధ‌వారం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. గురువారం సంజ‌య్ పాండే నుంచి వివేక్ ఫ‌ణ్‌షాల్క‌ర్ ముంబై పోలీస్ క‌మిష‌న‌ర్‌గా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు. 

1989 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన వివేక్ ఫ‌ణ్‌షాల్క‌ర్‌... మ‌హా‌రాష్ట్రలోని అకోలా ఏఎస్పీగా త‌న కెరీర్‌ను ప్రారంభించారు. ప్ర‌స్తుతం మ‌హారాష్ట్రలోని థానే న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్‌గా ఆయ‌న‌ ప‌నిచేస్తున్నారు. 2018 నుంచి ఆయ‌న అదే పోస్టులో కొన‌సాగుతున్నారు. అంత‌కుముందు ముంబై అవినీతి నిరోధ‌క శాఖ చీఫ్‌గానూ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు.