తెలుగు రాష్ట్రాల ఆర్ధిక మంత్రుల‌కు విందు ఇచ్చిన హ‌ర్యానా గ‌వ‌ర్న‌ర్ దత్తాత్రేయ‌

29-06-2022 Wed 19:57
  • జీఎస్టీ కౌన్సిల్ స‌మావేశం కోసం చండీగ‌ఢ్ వెళ్లిన ఆర్థిక మంత్రులు
  • రాజేంద్ర‌నాథ్‌, హ‌రీశ్‌ల‌ను విందుకు ఆహ్వానించిన ద‌త్తాత్రేయ‌
  • ట్విట్ట‌ర్‌లో ఫొటోల‌ను షేర్ చేసిన హ‌ర్యానా గ‌వ‌ర్న‌ర్‌
haryana governor Bandaru Dattatreya honoured Harish Rao and Buggana Rajendranath Reddy
తెలుగు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి, త‌న్నీరు హ‌రీశ్ రావులకు హ‌ర్యానా గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ విందు ఇచ్చారు. జీఎస్టీ కౌన్సిల్ స‌మావేశాల కోసం ఆయా రాష్ట్రాల ఆర్థిక మంత్రులు బుధ‌వారం హ‌ర్యానా, పంజాబ్ ఉమ్మడి రాజ‌ధాని చండీగ‌ఢ్‌కు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా తెలుగు రాష్ట్రాల ఆర్థిక మంత్రుల‌ను త‌న అధికారిక నివాసానికి ఆహ్వానించిన ద‌త్తాత్రేయ వారికి విందు ఇచ్చారు. 

ఈ సంద‌ర్భంగా ఇద్ద‌రు ఆర్థిక మంత్రుల‌ను ద‌త్తాత్రేయ ఘ‌నంగా స‌న్మానించారు. ఇద్ద‌రు మంత్రుల‌కు ఆయ‌న జ్ఞాపిక‌ల‌ను కూడా అంద‌జేశారు. ఈ విష‌యాన్ని ద‌త్తాత్రేయ‌నే స్వ‌యంగా ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించారు. ఇరు రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రుల‌ను స‌న్మానించ‌డం త‌న‌కు సంతోషాన్నిచ్చింద‌ని ద‌త్తాత్రేయ స‌ద‌రు ట్వీట్‌లో పేర్కొన్నారు.