2 న‌గ‌రాలు, ఓ ఎయిర్‌పోర్టు పేర్లు మార్చిన మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం

29-06-2022 Wed 18:57
  • శంభాజీ న‌గ‌ర్‌గా ఔరంగాబాద్‌
  • ధారాశివ్‌గా ఉస్మానాబాద్‌
  • డీబీ పాటిల్ ఎయిర్ పోర్టుగా న‌వీ ముంబై ఎయిర్‌పోర్టు
  • ఆమోదం తెలిపిన మ‌హారాష్ట్ర కేబినెట్
maharashtra cabinet changes 2 cities manes and a airport name
రాజ‌కీయ సంక్షోభం నెల‌కొన్న వేళ మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం బుధ‌వారం మూడు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. ఈ మేర‌కు సీఎం ఉద్ధ‌వ్ థాక‌రే నేతృత్వంలో భేటీ అయిన ఆ రాష్ట్ర కేబినెట్ 2 నగ‌రాల పేర్ల‌తో పాటు ఓ ఎయిర్ పోర్టు పేరును కూడా మారుస్తూ నిర్ణ‌యం తీసుకుంది. 

రాష్ట్రంలోని ఔరంగాబాద్ పేరును శంభాజీ న‌గ‌ర్‌గా మార్చేసిన కేబినెట్‌... ఉస్మానాబాద్ పేరును ధారాశివ్‌గా మార్చింది. అంతేకాకుండా ముంబైలోని న‌వీ ముంబై ఎయిర్ పోర్టు పేరును డీబీ పాటిల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుగా మార్చింది. ఈ మూడు ప్ర‌తిపాద‌న‌ల‌కు మ‌హారాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.