Hema Chandra: విడిపోతున్నారనే వార్తలపై హేమచంద్ర, శ్రావణ భార్గవి క్లారిటీ   

Hema Chandra and Sravana Bhargavi gives clarity on divorce
  • ఇద్దరూ విడిపోతున్నారంటూ కొన్ని రోజులుగా వార్తలు
  • పనికిమాలిన సమాచారం ఎక్కువగా వ్యాప్తి చెందుతోందన్న హేమచంద్ర
  • కొన్ని రోజులుగా ఇన్స్టాలో పాలోయర్స్ పెరిగిపోయారన్న శ్రావణ భార్గవి
టాలీవుడ్ సింగర్స్ జంట హేమచంద్ర, శ్రావణ భార్గవి విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఈ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని హేమచంద్ర, శ్రావణ భార్గవి సోషల్ మీడియా వేదికగా తెలిపారు. 

తన పాటల కంటే పనికిమాలిన సమాచారం ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని హేమచంద్ర తెలిపాడు. గత కొన్ని రోజుల నుంచి తన ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్స్, యూట్యూబ్ ఛానల్ కి వ్యూస్ పెరిగిపోయాయని శ్రావణ భార్గవి చెప్పారు. ఇప్పుడు తనకు గతంలో కంటే ఎక్కువ పని, సంపాదన లభిస్తోందని అన్నారు. వీరిద్దరూ పెట్టిన పోస్టులతో విడాకుల వార్తకు చెక్ పడినట్టయింది.
Hema Chandra
Sravana Bhargavi
Divorce

More Telugu News