'పుష్ప 2' ఆలస్యానికి కారణమదేనట!

29-06-2022 Wed 11:48
  • 'పుష్ప 2' కోసం జరుగుతున్న సన్నాహాలు
  • పాన్ ఇండియా స్థాయికి తగినట్టుగా కసరత్తు 
  • ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ 
  • వచ్చే ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు
Pushpa 2 movie update
అల్లు అర్జున్ హీరోగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సుకుమార్ తెరకెక్కించిన 'పుష్ప', విడుదలైన ప్రతి ప్రాంతంలో వసూళ్ల వర్షాన్ని కురిపించింది. దాంతో ఈ సినిమా సీక్వెల్ కి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే అందుకు సంబంధించిన సన్నాహాలు చాలావరకూ పూర్తయినట్టుగా చెబుతున్నారు. 

'పుష్ప' సినిమా విడుదల సమయానికే  'పుష్ప 2'కి సంబంధించిన చిత్రీకరణ కూడా కొంతవరకూ జరిగింది. అలాంటప్పుడు ఇంత ఆలస్యం దేనికి అనేది అభిమానుల సందేహం. అయితే ఫస్టు పార్టు సంచలన విజయాన్ని సాధించడంతో, సెకండ్ పార్టు అంతకుమించి అన్నట్టుగా ఉండాలి .. ఉంటుందని చెప్పారు కూడా.

అందుకే సెకండ్ పార్టు కోసం షూట్ చేసిన సీన్స్ ను కూడా మరింత గ్రాండ్ గా షూట్ చేయాలనే నిర్ణయానికి వచ్చారట. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించాలనే ఉద్దేశంతోనే అందుకు తగినట్టుగా అన్ని సీన్స్ ను డిజైన్ చేస్తున్నట్టుగా వినికిడి. ఆగస్టులో రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టి, వచ్చే ఏడాదిలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.