ముంబై మాఫియా నేపథ్యంలో విజయ్ సినిమా!

  • విజయ్ హీరోగా లోకేశ్ తెరకెక్కించిన 'మాస్టర్'
  • ప్రతి ప్రాంతంలోను భారీ వసూళ్లను నమోదు చేసిన సినిమా 
  • ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమాకి సన్నాహాలు 
  • గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్న విజయ్  
Vijay in Lokesh kanagaraj Movie

ఒక హిట్ ఇచ్చిన దర్శకులతో మరో సినిమా చేయడానికి హీరోలు ఉత్సాహాన్ని చూపించడం తెలిసిందే. అలా 'మాస్టర్' సినిమాతో తనకి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన లోకేశ్ కనగరాజ్ తో కలిసి మరో సినిమా చేయడానికి విజయ్ రెడీ అవుతున్నాడు. క్రితం ఏడాది ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'మాస్టర్' సంచలన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.

విజయ్ హీరోయిజం .. విజయ్ సేతుపతి విలనిజం ఈ కథకు మరింత బలాన్ని చేకూర్చాయి. ఈ రెండు పాత్రలను ఆయన డిజైన్ చేసిన తీరుకు ప్రశంసలు లభించాయి. అందువలన పెద్ద గ్యాప్ లేకుండానే లోకేశ్ తో కలిసి విజయ్ రంగంలోకి దిగిపోతున్నాడు. ముంబై నేపథ్యంలో ఈ కథ నడుస్తుందనేది తాజా సమాచారం. 

ఈ సినిమాలో ఆయన విజయ్ ను గ్యాంగ్ స్టర్ గా చూపించనున్నాడని అంటున్నారు. అందుకు తగినట్టుగానే విజయ్ లుక్ డిఫరెంట్ గా ఉంటుందని చెబుతున్నారు. మాఫియా నేపథ్యంలో లోకేశ్ నుంచి వచ్చిన 'ఖైదీ' .. 'విక్రమ్' సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ కావడంతో సహజంగానే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

More Telugu News