పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ నిర్మాత దిల్‌రాజు భార్య తేజస్విని

29-06-2022 Wed 09:51
  • 2020లో వరంగల్‌కు చెందిన తేజస్వినిని రెండో వివాహం చేసుకున్న దిల్‌రాజు
  • అనారోగ్యంతో 2017లో మృతి చెందిన మొదటి భార్య అనిత
  • మొదటి భార్యతో దిల్‌రాజుకు ఇప్పటికే ఒక కుమార్తె
Tollywood producer dil raju blessed with baby boy
రెండేళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్న టాలీవుడ్ నిర్మాత దిల్‌రాజు (52) తండ్రయ్యారు. ఆయన భార్య తేజస్విని ఈ ఉదయం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. విషయం తెలిసిన టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. 

దిల్‌రాజు మొదటి భార్య అనిత అనారోగ్య సమస్యలతో బాధపడుతూ 2017లో మరణించారు. ఈ క్రమంలో 10 డిసెంబరు 2020లో వరంగల్‌కు చెందిన తేజస్వినిని ఆయన రెండో వివాహం చేసుకున్నారు. దిల్‌రాజుకు మొదటి భార్య ద్వారా ఇప్పటికే ఓ కుమార్తె హన్షిత ఉంది. 

ఇదిలావుంచితే, దిల్‌రాజు ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. సొంత బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై విజయ్-వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో ‘వారసుడు’ సినిమా చేస్తుండగా, రామ్‌చరణ్‌-శంకర్ కాంబోలో మరో సినిమా రూపొందుతోంది.