సచిన్ తనయుడి ఫొటో షేర్ చేసిన ఇంగ్లండ్ మహిళా క్రికెటర్

28-06-2022 Tue 21:47
  • ప్రస్తుతం ఇంగ్లండ్ లో ఉన్న అర్జున్ టెండూల్కర్
  • నండోస్ రెస్టారెంట్ లో దర్శనం
  • బుజ్జి మిత్రుడు అంటూ పేర్కొన్న డానియెల్లే వ్యాట్
England woman cricketer Danny Wyatt shares Arjun Tendulker pic
సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడనప్పటికీ పాప్యులారిటీ విషయంలో ఏ స్టార్ క్రికెటర్ కీ తీసిపోడు. భారత క్రికెట్ దేవుడి కొడుకు అనే ట్యాగ్ తో అర్జున్ టెండూల్కర్ కు చాలా గుర్తింపు లభిస్తోంది. అర్జున్ టెండూల్కర్ దేశవాళీ క్రికెట్లో ఎంతో శ్రమిస్తున్నా, ఆశించిన బ్రేక్ లభించలేదు. ఇటీవల ఐపీఎల్ లోనూ కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడే అవకాశం రాలేదు. దాంతో సచిన్ అభిమానులు ఉసూరుమన్నారు. 

ఇక అసలు విషయానికొస్తే... అర్జున్ టెండూల్కర్ ప్రస్తుతం ఇంగ్లండ్ లో విహరిస్తున్నాడు. అర్జున్ ఓ రెస్టారెంట్లో విందు ఆరగిస్తున్న ఫొటోను ఇంగ్లండ్ మహిళా స్టార్ ఆల్ రౌండర్ డానియెల్లే వ్యాట్ సోషల్ మీడియాలో పంచుకుంది. "నండోస్ రెస్టారెంట్ లో నా బుజ్జి మిత్రుడ్ని చూస్తున్నందుకు సంతోషంగా ఉంది" అంటూ వ్యాట్ పేర్కొంది. 

కాగా, గతంలో అర్జున్ టెండూల్కర్, డానియెల్లే వ్యాట్ కలిసున్న ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేశాయి. అర్జున్ టెండూల్కర్ అమ్మమ్మ పుట్టిల్లు ఇంగ్లండ్ కావడంతో, తరచుగా ఇక్కడికి వస్తుంటాడు. అర్జున్ టెండూల్కర్ ఇక్కడి మైదానాల్లో ఇంగ్లిష్ క్రికెటర్లతో కలిసి ప్రాక్టీస్ చేస్తుంటాడు.