ఏపీ ర‌వాణా శాఖ క‌మిష‌న‌ర్‌గా రాజ‌బాబు... ఏపీలో ప‌లువురు ఐఏఎస్‌ల బ‌దిలీ

28-06-2022 Tue 21:17
  • మిష‌న్ క్లీన్ కృష్ణా,గోదావ‌రి కెనాల్స్ డైరెక్ట‌ర్‌గా కాటంనేని భాస్క‌ర్‌
  • ఆరోగ్య‌శ్రీ అద‌న‌పు సీఈఓగా హ‌రీంద్ర ప్ర‌సాద్‌
  • నెల్లూరు జిల్లా జేసీగా రోణంకి కూర్మ‌నాథ్‌
  • జీసీసీ ఎండీగా గేదెల సురేశ్ కుమార్‌ 
ias p rajababu posted as ap transport commissioner
ఏపీలో ప‌లువురు ఐఏఎస్ అధికారులు మంగ‌ళ‌వారం బ‌దిలీ అయ్యారు. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం రాత్రి ఉత్త‌ర్వులు జారీ చేసింది. రాష్ట్ర ర‌వాణా శాఖ కమిష‌న‌ర్‌గా రాజ‌బాబు నియ‌మితుల‌య్యారు. అదే విధంగా ఆరోగ్యశ్రీ అద‌న‌పు సీఈఓగా హరీంద్ర ప్రసాద్ నియ‌మితుల‌య్యారు. నెల్లూరు జిల్లా జేసీగా రోణంకి కూర్మ‌నాథ్‌ను ప్ర‌భుత్వం నియ‌మించింది.

ఇక మిగిలిన బ‌దిలీల విష‌యానికి వ‌స్తే... పార్వతీపురం ఐటీడీఏ పీఓగా ఆనంద్‌, మిష‌న్ క్లీన్ కృష్ణా, గోదావ‌రి కెనాల్స్ డైరెక్ట‌ర్‌గా కాటంనేని భాస్క‌ర్‌, గిరిజ‌న సంక్షేమ శాఖ ప‌రిధిలోని జీసీసీ ఎండీగా గేదెల సురేశ్ కుమార్‌, ఏపీసీఎఫ్ఎస్ఎస్ డిప్యూటీ సీఈఓగా సునీల్ కుమార్ రెడ్డి నియ‌మితుల‌య్యారు.