జ‌గ‌న్‌పై నోరు జారిన డిప్యూటీ సీఎం నారాయ‌ణ స్వామి.. వీడియో పోస్ట్ చేసిన టీడీపీ

28-06-2022 Tue 21:06
  • తిరుప‌తి ప్లీన‌రీలో నారాయ‌ణ స్వామి ప్ర‌సంగం
  • జ‌గ‌న్ భూక‌బ్జాదారుల‌కు నాయ‌కుడని అభివ‌ర్ణ‌న‌
  • జ‌గ‌న్ మాట్లాడేది అన్యాయ‌మేన‌న్న నారాయ‌ణ స్వామి
  • నిజం నిప్పులాంటిదంటూ వీడియోను పోస్ట్ చేసిన టీడీపీ
ap deputy cm narayana swamy viral comments on jagan
ఏపీ డిప్యూటీ సీఎం నారాయ‌ణ స్వామి మ‌రోమారు నోరు జారారు. త‌మ పార్టీ అధినేత‌, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఆయ‌న భూక‌బ్జాదారుల‌కు నాయ‌కుడిగా అభివ‌ర్ణించారు. అంతేకాకుండా జ‌గ‌న్ మాట్లాడేది అన్యాయ‌మ‌ని, ప్ర‌జ‌లు ఇప్ప‌టికైనా ఆలోచించి మేల్కోనాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ఈ మేర‌కు తిరుప‌తి వేదిక‌గా జ‌రిగిన పార్టీ ప్లీన‌రీలో నారాయ‌ణ స్వామి నోరు జారారు.

నారాయ‌ణ స్వామి నోరు జారిన వీడియోను ప‌ట్టేసిన టీడీపీ... ఆ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. నిజం నిప్పులాంటిది ఎక్కువ సేపు నోట్లో దాచుకోలేరు మరి అంటూ స‌ద‌రు వీడియోకు టీడీపీ ఓ కామెంట్‌ను జ‌త చేసింది. అంతేకాకుండా జ‌గ‌న్ ప‌ని అయిపోయింది అంటూ ఓ హ్యాష్ ట్యాగ్‌ను కూడా స‌ద‌రు వీడియోకు జ‌త చేసింది.