ముంబయిలో కుప్పకూలిన భవనం... 18కి పెరిగిన మృతుల సంఖ్య

28-06-2022 Tue 20:47
  • ముంబయిలో భారీ వర్షాలు
  • కుర్లా ప్రాంతంలో ఘటన
  • కూలిపోయిన నాలుగంతస్తుల భవనం
Death toll rises in Mumbai building collapse
ముంబయిలోని కుర్లా ప్రాంతంలో ఓ భవనం గతరాత్రి కుప్పకూలింది. ఈ ఘటనలో మృతి చెందినవారి సంఖ్య ప్రస్తుతం 18కి పెరిగింది. క్షతగాత్రులకు రాజావాడి, సియాన్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. గత కొన్నిరోజలుగా ముంబయి నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుర్లా ప్రాంతంలోని ఓ స్లమ్ ఏరియాలో ఉన్న నాలుగంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. 

శిథిలాల కింద చిక్కుకున్నవారిని వెలికితీసేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో 20 మంది గాయపడగా, వారిని వివిధ ఆసుపత్రులకు తరలించారు. కాగా, కూలిపోయిన భవనాన్ని ఆనుకుని ఉన్న భవనాల పరిస్థితి కూడా ప్రమాదకరంగా ఉన్నట్టు గుర్తించారు.