రాజ‌ధాని భూముల‌ను అమ్మొద్ద‌ని చెప్పే హ‌క్కు టీడీపీకి లేదు: ఏపీ మంత్రి సురేశ్

28-06-2022 Tue 19:37
  • రాజ‌ధాని రైతుల‌కు రూ.184 కోట్ల కౌలును ఇచ్చామ‌న్న మంత్రి
  • రైతుల‌కు ప్ర‌భుత్వం రాయితీలు ఇస్తోంద‌ని వెల్ల‌డి
  • రాజ‌ధాని భూముల అమ్మ‌కంపై టీడీపీ వాద‌న‌ల‌ను ఖండించిన సురేశ్
ap minister adimulapu suresh hits back tdp allegations on amaravati lands sale
ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం కోసం రైతుల నుంచి సేక‌రించిన భూముల‌ను ప్ర‌భుత్వం విక్ర‌యించే విష‌యంపై టీడీపీ చేస్తున్న ఆరోప‌ణ‌ల‌పై ఏపీ మునిసిప‌ల్ శాఖ మంత్రి ఆదిమూల‌పు సురేశ్ మంగ‌ళ‌వారం స్పందించారు. రాజ‌ధాని భూముల‌ను అమ్మకూడ‌ద‌ని చెప్పే హ‌క్కు టీడీపీకి లేదని ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు.

రాజ‌ధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతుల‌కు ఇవ్వాల్సిన రాయితీల‌ను ప్ర‌భుత్వం క్ర‌మం త‌ప్ప‌కుండా ఇస్తోంద‌ని మంత్రి సురేశ్ గుర్తు చేశారు. అందులో భాగంగానే రాజ‌ధాని రైతుల‌కు సోమ‌వారం కౌలు కింద రూ.184 కోట్ల‌ను వారి ఖాతాలో జ‌మ చేశామ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.