Narendra Modi: స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చి మోదీకి స్వాగతం పలికిన యూఏఈ అధ్యక్షుడు... వీడియో ఇదిగో!

UAE President welcomes prime minister Narendra Modi at Abu Dhabi airport
  • జర్మనీ పర్యటన ముగించుకున్న మోదీ
  • యూఏఈ చేరుకున్న వైనం
  • అబుదాబిలో మోదీకి ఆత్మీయ స్వాగతం
  • తనను కదిలించివేసిందన్న మోదీ
జర్మనీ పర్యటన ముగించుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ యూఏఈ పర్యటనకు తరలి వెళ్లారు. కొద్దిసేపటి క్రితమే అబుదాబిలో కాలు మోపిన ఆయనకు ఘనస్వాగతం లభించింది. యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ స్వయంగా ఎయిర్ పోర్టుకు విచ్చేసి ప్రధాని మోదీకి ఆత్మీయ స్వాగతం పలికారు. మోదీని ఆలింగనం చేసుకుని తమ సుహృద్భావాన్ని ప్రదర్శించారు. 

దీని పట్ల ప్రధాని మోదీ పొంగిపోయారు. "నా సోదరుడు, రారాజు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ స్వయంగా విమానాశ్రయానికి వచ్చి స్వాగతించడం నన్ను కదిలించివేసింది. ఆయనకు నా కృతజ్ఞతలు" అంటూ ట్వీట్ చేశారు.

కాగా, మోదీ తన యూఏఈ పర్యటనలో భాగంగా ఇటీవల దివంగతులైన యూఏఈ మాజీ పాలకుడు షేక్ ఖలీఫా బిన్ జాయేద్ అల్ నహ్యాన్ కు నివాళులు అర్పించనున్నారు.
Narendra Modi
UAE
Sheikh Mohamed bin Zayed Al Nahyan
Welcome
Airport
Abu Dhabi

More Telugu News