Joe Biden: బైడెన్ భార్య, కుమార్తె సహా 25 మంది అమెరికన్లపై నిషేధం విధించిన రష్యా

  • ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర
  • రష్యాపై ప్రపంచ దేశాల ఆంక్షలు
  • ప్రతిగా తాను కూడా ఆంక్షలు విధిస్తున్న రష్యా
  • తాజాగా రష్యా విదేశాంగ శాఖ ప్రకటన
Russia bans Biden wife and daughter

ఉక్రెయిన్ పై దండయాత్ర నేపథ్యంలో, తనను అంతర్జాతీయ సమాజం ఏకాకిని చేసే ప్రయత్నం చేస్తుండడం పట్ల రష్యా కూడా దీటుగా స్పందిస్తోంది. తాజాగా, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భార్య, కుమార్తె సహా 25 మంది అమెరికన్లపై రష్యా నిషేధం విధించింది. వారు రష్యాలో ప్రవేశించడంపై ఈ నిషేధం వర్తిస్తుందని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. 

రష్యాకు చెందిన రాజకీయ, పౌర ప్రముఖులపై ఆంక్షలు మరింత విస్తృతం చేస్తున్నందుకు బదులుగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ ప్రకటనలో తెలిపింది. 25 మంది అమెరికన్లను తాము నిషిద్ధ వ్యక్తుల జాబితాలో చేర్చామని వివరించింది. ఆయా వ్యక్తుల పేర్లతో కూడిన జాబితాను తన ప్రకటనకు జోడించింది. ఇందులో సుసాన్ కొలిన్స్, మిచ్ మెక్ కానెల్, చార్లెస్ గ్రాస్లే, కిర్ స్టెన్ గిల్లిబ్రాండ్ వంటి సెనేటర్లు కూడా ఉన్నారు. వీరితో పాటే పలువురు వర్సిటీ ప్రొఫెసర్లు, పరిశోధకులు, అమెరికా ప్రభుత్వ మాజీ అధికారుల పేర్లు కూడా జాబితాలో పొందుపరిచారు.

More Telugu News