ఐపీవోకు ‘ఆఫీసర్స్ చాయిస్’ తయారీ కంపెనీ
- సెబీ వద్ద దరఖాస్తు దాఖలు చేసిన అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలరీస్
- ఐపీవో ద్వారా రూ.2,000 కోట్ల సమీకరణ లక్ష్యం
- రుణాలు తీర్చివేసేందుకు ఉపయోగించనున్న కంపెనీ
ఐపీవో ద్వారా సమీకరించే ఈ రూ,1,000 కోట్ల రుణాలను తీర్చివేయడానికి కంపెనీ ఉపయోగించనుంది. తీసుకున్న రుణాలను చెల్లించలేకపోతుండడం, వ్యాపారంపై ప్రభావం చూపిస్తున్నట్టు కంపెనీ పేర్కొంది. దేశంలోని ప్రముఖ స్పిరిట్స్ కంపెనీల్లో ఇది కూడా ఒకటి. ఈ సంస్థ విస్కీ, రమ్, బ్రాందీ, వొడ్కా ను 29 దేశాల్లో విక్రయిస్తోంది. తొమ్మిది బాట్లింగ్ యూనిట్లు ఉన్నాయి.