met amaravati: ఏపీ, తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఆ జిల్లాల్లో పిడుగులు పడొచ్చు!

  • తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు వర్ష సూచన
  • నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు
  • ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం 
MeT issues Yellow alert for Telangana and andhra pradesh

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇరు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో సోమవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. నేడు, రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దాంతో, రెండు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 

ఏపీలో అన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని చెప్పింది. అదే సమయంలో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు యానాంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. 

ఇక, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఏపీలోని ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలకు పిడుగుల సూచన ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా పిడుగులు పడే అవకాశం ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు అధికంగా ఉందని అంచనా వేసింది.

More Telugu News