అందుకే ఎన్టీఆర్ ప్రాజెక్టు ఆలస్యమవుతోందట!

28-06-2022 Tue 10:57
  • ఎన్టీఆర్ సినిమా పనుల్లో కొరటాల
  • స్క్రిప్ట్ పై జరుగుతున్న కసరత్తు
  • బరువు తగ్గుతున్న ఎన్టీఆర్  
  • వినాయక చవితికి సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్
Ntr and Koratala Movie Update
ఎన్టీఆర్ - కొరటాల శివ ప్రాజెక్టు ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని అంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఈ పాటికే సెట్స్ పైకి వెళ్లవలసి ఉంది. కానీ 'ఆచార్య' ఫ్లాప్ కారణంగా .. ఇది పాన్ ఇండియా సినిమా కావడం వలన ఈ స్క్రిప్ట్ పై కొరటాల గట్టిగానే కసరత్తు చేస్తున్నాడట. ఈ సినిమా హిట్ తో 'ఆచార్య' ఫ్లాప్ ను మరిపించే ఆలోచనలో ఆయన ఉన్నాడని అంటున్నారు. 

'ఆర్ ఆర్ ఆర్' సినిమాలో కొమరం భీమ్ పాత్ర కోసం బరువు పెరిగిన ఎన్టీఆర్, ఈ సినిమా కోసం బరువు తగ్గుతున్నాడట. దాదాపు ఓ పది కేజీలు తగ్గవలసి ఉంటుందని కొరటాల చెప్పడంతో, ఎన్టీఆర్ ఆ పనిలో ఉన్నాడని అంటున్నారు. ఈ కారణంగానే ఈ ప్రాజెక్టు లేట్ అయిందని చెబుతున్నారు.

అయిన ఆలస్యం ఎలాగూ అయింది కనుక, 'వినాయక చవితి' రోజున ఈ సినిమా షూటింగును మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టుగా వినికిడి. 'జనతా గ్యారేజ్' తరువాత వస్తున్న సినిమా కావడం వలన, అందరిలో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో కథానాయికగా ఎవరనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది.