Telangana: తెలంగాణ‌లో కాంట్రాక్టు లెక్చ‌ర‌ర్లకు గుడ్ న్యూస్

telangana government regularises contract junior lecturers services
  • 148 మంది జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్ల‌కు ప్ర‌యోజ‌నం
  • వీరి స‌ర్వీసులు రెగ్యుల‌రైజ్ చేసిన వైనం
  • అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్ర‌భుత్వం
తెలంగాణ స‌ర్కారు ఇప్ప‌టికే వ‌రుస‌గా నోటిఫికేష‌న్లు ఇస్తూ నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌లు చెబుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా సోమ‌వారం ఆయా ప్ర‌భుత్వ క‌ళాశాలల్లో కాంట్రాక్ట్ పద్ధతిన లెక్చ‌రర్లుగా విధులు నిర్వర్తిస్తున్న వారికి కూడా గుడ్ న్యూస్ చెప్పింది. కాంట్రాక్టు పద్ధతిన పని చేస్తున్న జూనియ‌ర్ లెక్చ‌రర్ల స‌ర్వీసుల‌ను రెగ్యుల‌రైజ్ చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. 

ఈ ఉత్త‌ర్వుల‌తో రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిన ప‌నిచేస్తున్న 148 మంది జూనియ‌ర్ లెక్చ‌రర్ల‌కు ప్ర‌యోజ‌నం ల‌భించ‌నుంది. వీరి స‌ర్వీసులు రెగ్యుల‌రైజ్ కానున్నాయి.
Telangana
TRS
KCR
Lecturers
Junior Lecturers

More Telugu News