తెలుగు ప్రేక్షకుల ముందుకు మిస్టరీ థ్రిల్లర్ గా 'మాయోన్'

  • ఆసక్తికరమైన కంటెంట్ తో రూపొందిన 'మాయోన్'
  • శిబి సత్యరాజ్ సరసన నాయికగా తాన్య 
  • హైలైట్ గా నిలవనున్న ఇళయరాజా సంగీతం 
  • వచ్చేనెల 7వ తేదీన విడుదలవుతున్న సినిమా  
Maayon movie update

తమిళంలో సత్యరాజ్ తనయుడు శిబి, విభిన్నమైన కథాకథనాలను ఎంచుకుంటూ వెళుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'మాయోన్' ఈ నెల 24వ తేదీన తమిళంలో విడుదలైంది. శిబి జోడీగా తాన్య రవిచంద్రన్ నటించింది. వచ్చేనెల 7వ తేదీన ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా ఇక్కడ సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని, U సర్టిఫికేట్ ను సంపాదించుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తూ పోస్టర్ ను వదిలారు. ఇది మైథలాజికల్ టచ్ తో కూడిన మిస్టరీ థ్రిల్లర్. రొటీన్ కి భిన్నంగా ఈ సినిమా కంటెంట్ ఉంటుంది. 

కిశోర్ దర్శకుడిగా వ్యవహరించిన ఈ సినిమాకి ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు. అడుగడుగునా ఆసక్తికరమైన మలుపులతో ఈ కథ నడుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ప్రముఖ దర్శకుడు కేఎస్ రవికుమార్ ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు. ఈ సినిమా ఇక్కడ ఎలాంటి రిజల్టును రాబడుతుందో చూడాలి.

More Telugu News