'స్వాతిముత్యం' నుంచి సాంగ్ రిలీజ్!

  • విభిన్న కథా చిత్రంగా 'స్వాతిముత్యం'
  • హీరోగా బెల్లంకొండ గణేశ్ పరిచయం 
  • సంగీత దర్శకుడిగా మహతి స్వరసాగర్ 
  • ఆగస్టు 13వ తేదీన సినిమా విడుదల 
Swathi Muthyam Movie song released

బెల్లంకొండ గణేశ్ హీరోగా 'స్వాతిముత్యం' సినిమా రూపొందింది. విభిన్నమైన ఈ ప్రేమకథా చిత్రంలో వర్ష బొల్లమ్మ కథానాయికగా నటించింది. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకి లక్ష్మణ్ కృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి మహతి స్వరసాగర్  సంగీతాన్ని సమకూర్చాడు. 

కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ను రిలీజ్ చేశారు. "మిల మిలా మెరుపులా మరి మరీ మెరిసినా .. మతి చెడే  చూపుతో మనసు మబ్బుల్లో కెగిరెనా" అంటూ ఈ పాట సాగుతోంది. కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను అర్మాన్ మాలిక్ - సంజనా ఆలపించారు. 

హీరో హీరోయిన్లు లవ్ లో పడటం .. ఒకరిని గురించిన ఆలోచనలతో మరొకరు సతమతం కావడం .. అందమైన ఊహలలో తేలిపోవడం వంటి విజువల్స్ పై ఈ పాట సాగింది. సాహిత్యం ఓ మాదిరిగా అనిపించినా బీట్ యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది. ఆగస్టు 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

More Telugu News