మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు కరోనా

27-06-2022 Mon 16:38
  • ఇప్ప‌టికే క‌రోనా బారిన ప‌డిన సీఎం ఉద్ధ‌వ్‌
  • రెండు రోజుల క్రితం ఉద్ధవ్‌తో అజిత్ ప‌వార్ భేటీ
  • ఈ భేటీ కార‌ణంగానే అజిత్ కరోనా బారిన ప‌డినట్టు స‌మాచారం.
maharashtra deputy cm ajit pawar test positive for corona
మ‌హారాష్ట్రలో ఓ వైపు రాజ‌కీయ సంక్షోభం రోజుకో కొత్త మ‌లుపు తీసుకుంటూ ఉంటే... ఆ రాష్ట్ర రాజ‌కీయ నేత‌ల‌ను క‌రోనా చుట్టుముట్టేస్తోంది. ఇప్ప‌టికే మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ థాక‌రే కరోనా బారిన ప‌డ‌గా... తాజాగా సోమ‌వారం డిప్యూటీ సీఎం అజిత్ ప‌వార్ కూడా క‌రోనా బారిన ప‌డ్డారు. అజిత్ ప‌వార్‌కు కరోనా సోకిన‌ట్లు వైద్యులు తేల్చారు. 

మ‌హారాష్ట్ర రాజ‌కీయ సంక్షోభం నెల‌కొన్న స‌మ‌యంలోనే ఉద్ధ‌వ్ థాక‌రే క‌రోనా బారిన ప‌డగా.. రాజ‌కీయ సంక్షోభం నుంచి బయ‌ట‌ప‌డే దిశ‌గా ఆయ‌న బ‌య‌ట‌కు రాక త‌ప్ప‌డం లేదు. ఇప్ప‌టికే రెండు ప‌ర్యాయాలు ఆయ‌న బ‌య‌ట‌కు వ‌చ్చారు. అంతేకాకుండా త‌మ సంకీర్ణంలోని ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌ను ఆయ‌న క‌లుస్తున్నారు. ఈ క్ర‌మంలో రెండు రోజుల క్రితం థాక‌రేను ఆయ‌న నివాసంలోనే అజిత్ ప‌వార్ క‌లిశారు. ఈ కార‌ణంగానే అజిత్ ప‌వార్ క‌రోనా బారిన ప‌డిన‌ట్టు స‌మాచారం.