Narendra Modi: మ్యూనిక్ లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం ఇలా.. స్వయంగా వీడియో ట్వీట్​ చేసిన ప్రధాని

A solid welcome to Prime Minister Modi in Munich The Prime Minister himself tweeted the video
  • జీ7 సదస్సులో పాల్గొనేందుకు ఆదివారమే జర్మనీ వెళ్లిన మోదీ
  • ఆ సమయంలో ఘనంగా స్వాగతం పలికిన భారత సంతతి ప్రజలు
  • ఆ వీడియోను సోమవారం ట్వీట్ చేసిన ప్రధాని

జీ7 సదస్సులో పాల్గొనేందుకు జర్మనీలోని మ్యూనిక్ కు వెళ్లిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. అక్కడి భారత సంతతి ప్రజలతో పాటు స్థానికులు, అధికారికులు ఘానా స్వాగతం పలికారు. పలు కార్యక్రమాలతో ప్రధాని మోదీ అక్కడ బిజీ బిజీగా గడిపారు. వివిధ దేశాధి నేతలతో సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఘన స్వాగతం, ఆయా కార్యక్రమాల్లో పాల్గొనడంపై ప్రధాని మోదీ సోమవారం ట్వీట్ చేశారు.

“వివిధ అంతర్జాతీయ అంశాలపై చర్చించేందుకు జీ7 సదస్సులో పాల్గొంటున్నాను. మ్యూనిక్ లో నిన్న బవేరియన్ బ్యాండ్ తో ఘన స్వాగతం, ఇతర కార్యక్రమాలకు సంబంధించి హైలైట్స్ తో కూడిన వీడియో ఇదిగో..” అని ట్విట్టర్ పోస్టులో పేర్కొన్నారు. 

జీ7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఆదివారం మధ్యాహ్నమే జర్మనీలోని మ్యూనిక్ కు వెళ్లారు. పర్యావరణం, శక్తి వనరులు, ఉగ్రవాదం నియంత్రణ, ఉక్రెయిన్ సంక్షోభం తదితర అంశాల్లో ప్రపంచ దేశాల నేతలతో చర్చల్లో పాల్గొంటున్నారు. ఇదే సమయంలో వివిధ దేశాల అధిపతులతో విడిగా సమావేశమై ద్వంద్వ అంశాలపై చర్చలు జరుపుతున్నారు. 


Narendra Modi
Prime Minister
G7 summit
Twitter

More Telugu News