Priyanka Jawalkar: దయచేసి అలాంటి వార్తలు రాయకండి: హీరోయిన్ ప్రియాంక జవాల్కర్

Priyanka Jawalkar response on news on her love with Venkatesh Iyer
  • క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ ప్రేమలో పడిందంటూ వార్తలు
  • ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఫొటో షేర్ చేసిన ప్రియాంక
  • ఫొటోలో ఉన్నది వెంకటేశ్ అయ్యర్ అంటున్న నెటిజన్లు
టాలీవుడ్ సినీ నటి ప్రియాంక జవాల్కర్ యువ క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ ప్రేమలో పడిపోయిందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారమవుతున్నాయి. ఇటీవల ప్రియాంక సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఫొటో ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. 

తన ఎదుట ఒక వ్యక్తి కూర్చున్న ఫొటోను ఆమె షేర్ చేసింది. ఇందులో సదరు వ్యక్తి మొఖం కనిపించకుండా అటువైపుకు తిరిగి కూర్చున్నాడు. అయితే ఆ వ్యక్తి వెంకటేశ్ అయ్యరే అని నెటిజన్లు అంటున్నారు. 

ఈ వార్తలపై ప్రియాంక స్పందిస్తూ... ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి తమకు పనిలో సాయం చేసేందుకు వచ్చాడని తెలిపింది. తన బాయ్‌ ఫ్రెండ్ అని వార్తలు వస్తుండటంతో... 'ఏంటి విషయం?' అని తన తల్లి అడిగిందని చెప్పింది. దయచేసి ఇలాంటి వార్తలు రాయవద్దని కోరింది.
Priyanka Jawalkar
Tollywood
Venkatesh Iyer
Cricketer
Love

More Telugu News