మా ప్రాణాలకు ముప్పు ఉంది: సుప్రీంకోర్టులో శివసేన రెబెల్స్ పిటిషన్

27-06-2022 Mon 14:21
  • సుప్రీంకోర్టులో రెబెల్స్ నాయకుడు ఏక్ నాథ్ షిండే పిటిషన్ 
  • బతికున్న శవాలు అంటూ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలను పిటిషన్ లో పేర్కొన్న వైనం
  • సంకీర్ణ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయిందని కోర్టుకు వెల్లడి
Shiv Sena rebel Eknath Shinde files petition in Supreme Court
మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం ముదురుతోంది. పార్టీపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన ఎమ్మెల్యేల గ్రూపులో ఉన్న తొమ్మిది మంది మంత్రులపై ఆ పార్టీ అధినేత, మహా ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే వేటు వేశారు. మరోవైపు తమ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని రెబెల్ గ్రూప్ నాయకుడు ఏక్ నాథ్ షిండే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమను బతికున్న శవాలు అంటూ శివసేన నేత సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలను కూడా పిటిషన్ లో ఆయన పొందుపరిచారు. 

మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలోని శివసేనకు చెందిన 55 మంది ఎమ్మెల్యేలలో 38 మంది మద్దతును ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం మైనార్టీలో పడిపోయిందని చెప్పారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని స్వీకరించేలా డిప్యూటీ స్పీకర్ కు ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్ లో కోరారు. రెబెల్ ఎమ్మెల్యేలంతా అసోంలోని గువాహటిలో క్యాంపు పెట్టిన సంగతి తెలిసిందే.