Bihar: మావోయిస్టు ఉద్యమం వెనుక చైనా హస్తం ఉందా.?

Bihar Maoist arrested with Chinese assault rifle
  • బీహార్ లో సీఆర్పీఎఫ్, ఎస్ఎస్ బీ పోలీసుల ప్రత్యేక డ్రైవ్
  • భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు స్వాధీనం
  • వీటిల్లో చైనా తయారీ ఏకే 56, ఏకే 47, అసాల్ట్ రైఫిల్ 
మావోయిస్టులకు చైనా పరోక్ష సహకారం అందిస్తోందా..? బీహార్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఓ మావోయిస్టు నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో.. చైనా తయారీ రైఫిల్స్ ఉండడం ఈ అనుమాలకు తావిస్తోంది. అనుమానిత మావోయిస్టులను గుర్తించేందుకు, ఆయుధాల సమాచారంతో పోలీసులు గయ, ఔరంగాబాద్, బంకా జిల్లాల్లో ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించారు. 

గత మూడు రోజులుగా సీఆర్పీఎఫ్, ఎస్ఎస్ బీ పోలీసులు ఆపరేషన్ నిర్వహించగా.. బోక్తా అనే మావోయిస్టును అదుపులోకి తీసుకోవడంతోపాటు భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అందులో చైనా తయారీ ఏకే56, ఏకే4 రైఫిల్స్, దేశీ తయారీ రైఫిల్స్, గ్రనేడ్లు కూడా ఉన్నాయి. ప్రధానంగా పెద్ద ఎత్తున ఆయుధాలు ఉన్నట్టు అందిన సమాచారంతోనే పోలీసులు ఈ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు.
Bihar
Maoist
Chinese assault rifle
ak 47
ak 56

More Telugu News