Zimbabwe: జింబాబ్వేలో డిపాజిట్ చేస్తే ఏడాదికే మూడింతలు!

Zimbabwe plans to hike interest rate to 190 percent as inflation shoots past 191 percent in June
  • ప్రస్తుతం అక్కడ కీలక వడ్డీ రేటు 80 శాతం
  • 190 శాతానికి పెంచాలన్న యోచన
  • ఈ వారం చివర్లో వెలువడనున్న నిర్ణయం
  • జూన్ నెలలో 191 శాతానికి చేరిన ద్రవ్యోల్బణం
జింబాబ్వే ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. ప్రపంచంలోనే అత్యధిక వడ్డీ రేట్లు ఉన్న దేశం ఇది. అక్కడి సెంట్రల్ బ్యాంకు కీలక వడ్డీ రేటును రెట్టింపు చేసి 190 శాతానికి చేర్చాలని అనుకుంటోంది. ఈ విషయాన్ని అక్కడి సెంట్రల్ బ్యాంకు మానిటరీ పాలసీ కమిటీ సభ్యుడైన గ్వన్యాన్య తెలిపారు. 

స్పెక్యులేషన్ ధోరణితో తీసుకుంటున్న రుణాలు దేశ కరెన్సీ విలువ పతనానికి కారణమవుతున్నాయని చెప్పారు. వాటిని నిరుత్సాహ పరిచేందుకే వడ్డీ రేట్లను పెంచాలని అనుకుంటున్నట్టు తెలిపారు. జింబాబ్వేలో ద్రవ్యోల్బణం జూన్ నెలకు 191.6 శాతానికి చేరింది. ఈ నేపథ్యంలో గ్వన్యాన్య మీడియాతో మాట్లాడారు. ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోవడంతో దీనికి సమాన స్థాయిలో వడ్డీ రేట్లను తీసుకెళ్లడంపై జింబాబ్వే సెంట్రల్ బ్యాంకు ఎంపీసీ ఈ వారం చివర్లో నిర్ణయం ప్రకటించనుంది.

ప్రస్తుతం జింబాబ్వేలో కీలక రేటు 80 శాతంగా ఉంది. దీనికంటే తక్కువ రేటుకు రుణాలు ఇవ్వరాదంటూ జూన్ 17న తాము బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశామని గ్వన్యాన్య తెలిపారు. బుల్లెట్ ను విడిచి పెట్టాలని నిర్ణయించామని, దూకుడుగా వడ్డీ రేట్లను పెంచడం ద్వారా స్థిరత్వాన్ని సాధిస్తామని ప్రకటించారు. 190 శాతం వడ్డీ రేటు ప్రకారం రూ.10,000 డిపాజిట్ మొత్తం ఏడాది తర్వాత సుమారు రూ.29,000 అవుతుంది.
Zimbabwe
interest rate
190 percent
inflation
shoots up

More Telugu News