Vaishnavtej: దానికీ నాకు మాటల్లేవ్ .. 'రంగ రంగ వైభవంగా' టీజర్ రిలీజ్

Ranga Ranga Vaibhavanga teaser released
  • మరో ప్రేమకథా చిత్రంగా 'రంగ రంగ వైభవంగా'
  • వైష్ణవ్ తేజ్ సరసన కేతిక శర్మ 
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్    
  • దర్శకుడిగా గిరీశాయ పరిచయం
'ఉప్పెన' వంటి ప్రేమకథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వైష్ణవ్ తేజ్, తొలి సినిమాతోనే యూత్ హృదయాలను దోచేసుకున్నాడు. 'రంగ రంగ వైభవంగా' అనే సినిమాతో మరో ప్రేమకథతో పలకరించడానికి ఆయన మళ్లీ రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో ఆయన జోడీగా కేతిక శర్మ అలరించనుంది. 

బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి, గిరీశాయ దర్శకత్వం వహించాడు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. లవ్ .. రొమాన్స్ .. యాక్షన్ కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది.

 టీజర్ ను బట్టి ఇది యూత్ కి బాగానే కనెక్ట్ అవుతుందనిపిస్తోంది. వైష్ణవ్ తేజ్ లుక్స్ లోను .. ఎక్స్ ప్రెషన్స్ లోను అక్కడక్కడా పవన్ గుర్తుకు వస్తున్నాడు. ఇక ఈ సినిమాతో రొమాంటిక్ లుక్స్ పరంగా కేతిక మరిన్ని మార్కులను సంపాదించుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమా  ప్రేక్షకుల ముందుకు రానుంది.
Vaishnavtej
Kethika Sharma
Ranga Ranga Vaibhavanga Movie

More Telugu News