COVID19: దేశంలో మళ్లీ 17వేల కరోనా కొత్త కేసులు

  • మొన్నటితో పోలిస్తే వెయ్యికి పైగా పెరుగుదల
  • 24 గంటల్లో 21 మంది మృతి
  • ప్రస్తుతం 94,420 యాక్టివ్ కేసులు 
India reports 17 073 fresh COVID19 cases and 21 deaths  today

దేశంలో మూడు రోజుల్లో రెండోసారి కరోనా కొత్త కేసుల సంఖ్య 17 వేలు దాటింది. గడచిన 24 గంట్లలో 17, 073 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించింది. ఆదివారం విడుదలైన బులిటెన్ లో 15,940 కేసులు వచ్చాయని తెలిపింది. దాంతో ఒక్క రోజులోనే కొత్త కేసుల సంఖ్య వెయ్యికి పైగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
 
  మూడు రోజుల కిందట కూడా 17వేల పైచిలుకు కేసులు వచ్చాయి. ఫిబ్రవరి తర్వాత ఇన్ని కేసులు రావడం ఈ నాలుగు నెలల్లో మొదటిసారి. ఇక, గడచిన 24 గంటల్లో కరోనాతో 21 మంది మృతి చెందారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. దాంతో, దేశంలో కరోనా మరణాల సంఖ్య 5,25,020కి చేరుకుంది. మరణాల రేటు 1.21 శాతంగా నమోదైంది. 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 94, 420 యాక్టిక్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి గడచిన 24 గంటల్లో 15, 208 మంది కోలుకున్నారు. దాంతో, వైరస్ నుంచి బయటపడిన వారి సంఖ్య 4,27,87,606కి చేరుకుంది. రికవరీ రేటు 98.57 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటిదాకా 197 కోట్ల పైచిలుకు కరోనా వ్యాక్సిన్లు అందజేశారు. నిన్న ఒక్క రోజే 2,49,646 డోసులు దేశ వ్యాప్తంగా పంపిణీ చేశారు.

More Telugu News