ప్రేమ వివాహం చేసుకోబోతున్న హీరో రామ్... అమ్మాయి ఎవరంటే..!

27-06-2022 Mon 11:00
  • తన స్కూల్ మేట్ ని పెళ్లి చేసుకోబోతున్న రామ్
  • కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న జంట
  • ఆగస్ట్ లేదా సెస్టెంబర్ లో జరగనున్న పెళ్లి
Ram Pothineni going to marry his lover
టాలీవుడ్ హీరోలందరూ వరుసగా వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పుడు మరో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, చాకొలేట్ బోయ్ రామ్ పోతినేని వంతు వచ్చింది. రామ్ త్వరలోనే లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నాడు. తన స్కూల్ మేట్, ప్రియురాలిని పెళ్లాడబోతున్నట్టు సమాచారం. వీరి ప్రేమకు ఇరువురి కుటుంబాలు అంగీకారం తెలపడంతో... రామ్ ఇంట పెళ్లిబాజాలు మోగనున్నాయి.

ఈ ఏడాది ఆగస్ట్ లో కానీ, సెప్టెంబర్ లో కానీ పెళ్లి జరగవచ్చని సమాచారం. పెళ్లి తేదీలకు సంబంధించి రామ్ కుటుంబ సభ్యులు త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారు. రామ్, అతని ప్రియురాలు స్కూల్ మేట్స్ అని... కొన్నేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని సమాచారం. 

ఇక రామ్ తాజా చిత్రం 'వారియర్' జులై 14న విడుదల కాబోతోంది. సినిమా విడుదలైన తర్వాత వీరి ఎంగేజ్ మెంట్ జరగనుంది. ఆ తర్వాత ఆగస్ట్ లేదా, సెప్టెంబర్ లో పెళ్లి జరుగుతుంది. తన పెళ్లి గురించి రామ్ గతంలోనే ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. పెళ్లి అనేది మన చేతుల్లోనే ఉందని... జరగాల్సిన సమయంలో, జరగాల్సిన వ్యక్తితో జరుగుతుందని ఆయన అన్నాడు. చెప్పినట్టుగానే ఇప్పుడు తనకిష్టమైన వ్యక్తిని పెళ్లాడబోతున్నాడు.