'పుష్ప 2' కోసం రంగంలోకి విజయ్ సేతుపతి!

27-06-2022 Mon 10:22
  • సంచలన విజయాన్ని సాధించిన 'పుష్ప'
  • సెకండ్ పార్టు కోసం జరుగుతున్న సన్నాహాలు 
  • ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే ఛాన్స్
  • విజయ్ సేతుపతి కోసం పవర్ఫుల్ రోల్ ను క్రియేట్ చేసిన సుకుమార్ 
Pushpa2 movie update
సుకుమార్ - బన్నీ కాంబినేషన్లో వచ్చిన 'పుష్ప' సంచలన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. దాంతో ఆ సినిమాకి సీక్వెల్ గా 'పుష్ప 2' చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. స్క్రిప్ట్ పై కసరత్తు దాదాపు పూర్తయిందని అంటున్నారు. ఆగస్టు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టే దిశగా పనులు జరుగుతున్నాయి.

ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం విజయ్ సేతుపతిని తీసుకున్నారనేది తాజా సమాచారం. ' పుష్ప' సినిమాలో ఫహాద్ ఫాజిల్ పాత్ర కోసం ముందుగా విజయ్ సేతుపతిని తీసుకున్నారు. అయితే షూటింగు ఆలస్యంగా మొదలుకావడంతో డేట్లు సర్దుబాటు చేయలేక ఈ ప్రాజెక్టు నుంచి ఆయన తప్పుకున్నాడు. 

అయితే 'పుష్ప 2'కి మరింత హైప్ తీసుకుని రావడం కోసం, ఈ సారి విజయ్ సేతుపతి కోసం మరో పవర్ఫుల్ రోల్ ను సుకుమార్ డిజైన్ చేసినట్టుగా చెబుతున్నారు. సెకండ్ పార్టుకి ఆయన రోల్ హైలైట్ అయ్యేలా చూస్తున్నారట. ఇక ఫస్టు పార్టుకి వచ్చిన రెస్పాన్స్ చూసిన కారణంగా, విజయ్ సేతుపతి కూడా ఉత్సాహంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు.