పంచతంత్ర కథలు చిత్రం నుంచి 'నేనేమో మోతెవరి' పాట విడుదల

26-06-2022 Sun 21:54
  • పంచతంత్ర కథలు నుంచి కొత్త సాంగ్ రిలీజ్ 
  • దర్శకుడిగా పరిచయం అవుతున్న గంగనమోని శేఖర్
  • సెన్సార్ పనులు పూర్తి
  • త్వరలో విడుదల
New song released from Panchatantra Kathalu
నోయెల్, నందిని రాయ్‌, సాయి రోనక్‌, గీత భాస్క‌ర్‌, ప్ర‌ణీత ప‌ట్నాయ‌క్‌, నిహాల్ కోద‌ర్తి, సాదియ‌, అజ‌య్ క‌తుర్వ‌ర్ త‌దిత‌రులు నటిస్తున్న చిత్రం 'పంచతంత్ర కథలు'. ఈ చిత్రం నుంచి తాజాగా 'నేనేమో మోతెవరి... నువ్వేమో తోతాపరి' లిరికల్ వీడియో సాంగ్ రిలీజైంది. ఈ పాటను ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ ఆవిష్కరించారు. మ‌ధు క్రియేష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త డి. మ‌ధు నిర్మిస్తున్నారు. గంగ‌న‌మోని శేఖ‌ర్ ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. 

ఐదు వేరు వేరు క‌థ‌ల‌ సమాహారం కావ‌డంతో ఈ మూవీకి `పంచ‌తంత్ర క‌థ‌లు` అనే టైటిల్ పెట్ట‌డం జ‌రిగింది. ప్ర‌స్తుతం సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని విడుద‌ల‌కి సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి కమ్రాన్ సంగీతం అందించారు. నేనేమో మోతెవరి అంటూ సాగే పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. కాగా, ఈ చిత్రంలో దర్శకుడు తరుణ్ భాస్కర్ తల్లి కూడా ఓ పాత్ర పోషించారు.