టీమిండియా, ఐర్లాండ్ టీ20 మ్యాచ్ ప్రారంభానికి వర్షం అడ్డంకి

26-06-2022 Sun 21:16
  • టీమిండియా, ఐర్లాండ్ మధ్య రెండు మ్యాచ్ ల సిరీస్
  • డబ్లిన్ లో నేడు తొలి మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
  • అరంగేట్రం చేస్తున్న ఉమ్రాన్ మాలిక్
Rain delays Team India and Ireland first T20 match
రెండు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా టీమిండియా, ఐర్లాండ్ మధ్య తొలి మ్యాచ్ నేడు జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ కు డబ్లిన్ వేదికగా నిలుస్తోంది. అయితే, మ్యాచ్ ప్రారంభానికి ముందు వర్షం పడడంతో మైదానం జలమయమైంది. దాంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఈ పోరులో టాస్ గెలిచిన టీమిండియా సారథి హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ ద్వారా యువ పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టనున్నాడు.

టీమిండియా...
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అవేశ్ ఖాన్, యజువేంద్ర చహల్, ఉమ్రాన్ మాలిక్.

ఐర్లాండ్...
ఆండ్రూ బాల్ బిర్నీ (కెప్టెన్), పాల్ స్టిర్లింగ్, గారెత్ డెలానీ, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టకర్ (వికెట్ కీపర్), జార్జ్ డాక్రెల్, మార్క్ అడైర్, ఆండీ మెక్ బ్రైన్, క్రెయిగ్ యంగ్, జాషువా లిటిల్, కానర్ ఓల్ఫెర్ట్.