రేపు శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటన... అమ్మ ఒడి నిధులు విడుదల

26-06-2022 Sun 20:46
  • శ్రీకాకుళంలో బహిరంగ సభ
  • అమ్మ ఒడి లబ్దిదారులతో సీఎం ముఖాముఖి
  • ఒక్క బటన్ క్లిక్ తో నిధుల విడుదల
CM Jagan will tour in Srikakulam tomorrow
ఏపీ సీఎం జగన్ రేపు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. అమ్మ ఒడి నిధులను శ్రీకాకుళంలో జరిగే ఓ కార్యక్రమంలో విడుదల చేయనున్నారు. సోమవారం ఉదయం 8.30 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నుంచి బయల్దేరతారు. ఉదయం 10.30 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటారు. 11 గంటలకు శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరవుతారు. జగనన్న అమ్మ ఒడి పథకం లబ్దిదారులతో ముఖాముఖిలో పాల్గొంటారు. 

ఒక్క కంప్యూటర్ బటన్ క్లిక్ తో అమ్మ ఒడి లబ్దిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు. అనంతరం సీఎం ప్రసంగం ఉంటుంది. మధ్యాహ్నం 12.15 గంటలకు శ్రీకాకుళం నుంచి తిరుగు పయనమవుతారు. మధ్యాహ్నం 2.30 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు.