లుంగీ కట్టుకుని డాబా హోటల్ వద్ద కనిపించిన యువ హీరో కిరణ్ అబ్బవరం... వీడియో ఇదిగో!

26-06-2022 Sun 19:47
  • రాజావారు రాణిగారు చిత్రంతో కిరణ్ అబ్బవరం ఎంట్రీ
  • తాజాగా సమ్మతమే చిత్రంలో నటించిన వైనం
  • లుంగీతో ఉన్న కిరణ్ ను చూసి ప్రజల ఆశ్చర్యం
  • వీడియో వైరల్
Kiran Abbavaram spotted at a Dhaba hotel
ఇటీవల కాలంలో 'ఎస్ఆర్ కల్యాణమండపం', 'సెబాస్టియన్' వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం. 'రాజావారు రాణిగారు' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం తాజాగా సమ్మతమే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 

ఇక అసలు విషయానికొస్తే... కిరణ్ అబ్బవరం ఎంతో నిరాడంబరంగా లుంగీ కట్టుకుని ఓ డాబా హోటల్ వద్దకు రావడం అందరి దృష్టిని ఆకట్టుకుంది. హైదరాబాదు పరిసరాల్లోని ఆ డాబా హోటల్ లో లుంగీతో ఉన్న కిరణ్ ను చూసి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ దృశ్యాలను కొందరు తమ వీడియోల్లో బంధించారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు సందడి చేస్తున్నాయి.