బండ్లగూడ, పోచారంలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల అమ్మకానికి భారీ స్పందన

26-06-2022 Sun 19:19
  • నోటిఫికేషన్ జారీ చేసిన హెచ్ఎండీఏ
  • బండ్లగూడలో అమ్మకానికి 2,246 ఫ్లాట్లు
  • పోచారంలో అమ్మకానికి 5,921 ఫ్లాట్లు
  • లాటరీ పద్ధతిలో ఫ్లాట్ల అమ్మకం
  • రేపటి నుంచి లాటరీ ప్రక్రియ షురూ
Notification for Rajiv Swagruha Flats in Bandlaguda and Pocharam
బండ్లగూడ, పోచారంలోని రాజీవ్ సృగృహ ఫ్లాట్ల అమ్మకానికి హెచ్ఎండీఏ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో, రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల అమ్మకానికి భారీ స్పందన లభిస్తోంది. బండ్లగూడలోని 2,246 ఫ్లాట్ల కొనుగోలు కోసం 33,161 దరఖాస్తులు వచ్చాయి. పోచారంలో 1,470 ఫ్లాట్ల కోసం 5,921 దరఖాస్తులు వచ్చాయి. రేపటి నుంచి లాటరీ పద్ధతిలో ఫ్లాట్లు కేటాయించనున్నారు. 

ఈ నెల 27న పోచారంలోని ఫ్లాట్లకు, ఈ నెల 28న బండ్లగూడలోని ఫ్లాట్లకు డ్రా తీస్తారు. రేపు ఉదయం 9 గంటల నుంచి లాటరీ ప్రక్రియను ఫేస్ బుక్, యూట్యూబ్ లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ప్రసారం చేయనున్నారు. లాటరీ షెడ్యూల్, ఇతర వివరాలను రాజీవ్ స్వగృహ, హెచ్ఎండీఏ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచినట్టు అధికారులు వెల్లడించారు.