Srikakulam District: గ్రామ స‌చివాల‌య సిబ్బందిపై దాడి చేసి వారిపైనే కేసు పెట్టిన స‌ర్పంచ్ కుటుంబం... వీడియో ఇదిగో

police cases on village secretariat staff by the village sarpanch complaint
  • శ్రీకాకుళం జిల్లా నందిగామ మండ‌లం క‌విటి అగ్ర‌హారంలో ఘ‌ట‌న‌
  • స‌ర్పంచ్ భ‌ర్త‌పై స‌చివాల‌య సిబ్బంది పోలీసుల‌కు ఫిర్యాదు
  • తిరిగి స‌చివాల‌య సిబ్బందిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన స‌ర్పంచ్‌
  • త‌న మ‌న‌శ్శాంతికి భంగం క‌లిగించార‌ని ఆరోపించిన స‌ర్పంచ్‌
  • ఐపీసీ 506,509 సెక్షన్ల కింద స‌చివాల‌య సిబ్బందిపై పోలీసుల కేసులు
శ్రీకాకుళం జిల్లా నందిగామ మండ‌లం క‌విటి అగ్ర‌హారం గ్రామ స‌చివాలయం సిబ్బందిపై గ్రామ స‌ర్పంచ్ బొమ్మాళి వ‌ర‌ల‌క్ష్మి భ‌ర్త గున్న‌య్య శ‌నివారం దాడికి దిగారు. స‌చివాల‌యంలోనే జ‌రిగిన ఈ దాడికి చెందిన దృశ్యాలు మీడియాలో వైర‌ల్ అయ్యాయి. దీంతో గున్న‌య్య దాడిలో గాయప‌డ్డ దివ్యాంగుడైన‌ స‌చివాల‌య డిజిట‌ల్ అసిస్టెంట్ వాసుదేవ‌రావు శ‌నివారరం పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా గున్న‌య్య‌పై పోలీసులు కేసు కూడా న‌మోదు చేశారు.

అయితే ఆదివారం ఉద‌యానికి ఈ వ్య‌వ‌హారం కీల‌క మ‌లుపు తీసుకుంది. త‌న మ‌న‌శ్శాంతికి భంగం క‌లిగించారంటూ స‌ర్పంచ్ వ‌ర‌ల‌క్ష్మి స్వ‌యంగా పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా వాసుదేవ‌రావు స‌హా స‌చివాల‌యంలో ప‌నిచేస్తున్న‌ ఇంజినీరింగ్ అసిస్టెంట్ రాంప్ర‌సాద్‌, స‌చివాల‌యం వెల్ఫేర్ అసిస్టెంట్ వ‌డ్ని మోహ‌న్ లాల్‌పైనా పోలీసులు కేసులు న‌మోదు చేశారు. వీరిపై ఐపీసీ 506,509 సెక్ష‌న్ల‌ ఆధారంగా కేసులు న‌మోద‌య్యాయి.
Srikakulam District
Village Secretariat
AP Police

More Telugu News