Chetti Palguna: ఇళ్లు ఇవ్వకుండా చంద్రబాబే అడ్డుకుంటున్నారు.. ఆయన కనిపిస్తే కొట్టండి: అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ

Chetti Palguna Controversial Comments On Chandrababu
  • గడపగడపకు కార్యక్రమంలో భాగంగా తీగలవలసలో పర్యటన
  • ఇళ్లు కావాలని అడిగిన మహిళలు
  • తాము సిద్ధంగానే ఉన్నామన్న ఎమ్మెల్యే 
  • చంద్రబాబు కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంటున్నారన్న ఫాల్గుణ
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై అరకులోయ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన కనిపిస్తే కొట్టాలని, తిట్టాలని ప్రజలను కోరారు. ఎమ్మెల్యే వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. గడపగడపకు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే శుక్రవారం హుకుంపేట మండలంలోని తీగలవలసలో పర్యటించారు. ఈ సందర్భంగా కొందరు మహిళలు తమకు ఇళ్లు ఇప్పించాలని కోరారు. 

స్పందించిన ఎమ్మెల్యే గిరిజనులకు ఇళ్లు ఇచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే, వాటిని ఇవ్వకుండా  కోర్టుల్లో కేసులు వేసి చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అందువల్లే ఇళ్లు ఇవ్వడం సాధ్యం కావడం లేదని అన్నారు. అంతేకాదు, ఇళ్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్న చంద్రబాబు కనిపిస్తే కొట్టాలని, తిట్టాలని వారికి సూచించారు.

Chetti Palguna
YSRCP
Araku
Chandrababu
TDP

More Telugu News