ప్రేమించకుంటే చంపేస్తానని బెదిరింపు.. యువతి ఆత్మహత్య

  • హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లి మండలంలో ఘటన
  • ఇంటికొచ్చి మరీ బెదిరించిన నిందితుడు
  • అవమానం భరించలేక బావిలోకి దూకి ఆత్మహత్య
young girl committed Suicide in hanamakonda

తెలంగాణలోని హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో వేధింపులు భరించలేని ఓ యువతి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని గట్లనర్సింగాపూర్‌కు చెందిన నమిండ్ల శ్వేత (18) కరీంనగర్‌లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి చెందిన మీసాల వంశీ ప్రేమిస్తున్నానంటూ ఏడాది కాలంగా ఆమె వెంట పడుతూ వేధిస్తున్నాడు.

శుక్రవారం సాయంత్రం స్నేహితుడు జగదీశ్‌తో కలిసి శ్వేత ఇంటికి వచ్చిన వంశీ ఆమెతో గొడవపడ్డాడు. అదే సమయంలో ఆమె తండ్రి రావడంతో భయపడి పారిపోతూ.. తనను ప్రేమించకుంటే ఎప్పటికైనా చంపేస్తానని, పరువు తీస్తానని బెదిరించాడు. అవమానం భరించలేని శ్వేత నిన్న గ్రామ శివారులోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News