N Amarnath Reddy: జ‌గ‌న్ కేసుల్లో మంత్రి డెవ‌ల‌ప‌ర్స్ 25వ ముద్దాయి!: టీడీపీ నేత అమ‌ర్నాథ్ రెడ్డి

tdp leader n amarnath reddy says mantri developers is the accused in jagan ed cases
  • సుశీల్ పీ మంత్రిని అరెస్ట్ చేసిన ఈడీ
  • జ‌గ‌న్ కేసుల్లో మంత్రి డెవ‌ల‌ప‌ర్స్ ప్ర‌మేయాన్ని ప్ర‌స్తావించిన టీడీపీ నేత‌
  •  నిందితుల జాబితాను త‌న ట్వీట్‌కు జ‌త చేసిన అమ‌ర్నాథ్ రెడ్డి 
మ‌నీ ల్యాండ‌రింగ్ కేసులో ఆరెస్టయిన ప్ర‌ముఖ రియల్టీ సంస్థ మంత్రి డెవ‌ల‌ప‌ర్స్ డైరెక్ట‌ర్ సుశీల్ పీ మంత్రి వ్య‌వ‌హారంపై టీడీపీ సీనియర్ నేత‌, మాజీ మంత్రి అమ‌ర్నాథ్ రెడ్డి ఓ కీల‌క విష‌యాన్ని ట్వీట్ చేశారు. ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై న‌మోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మంత్రి డెవ‌ల‌ప‌ర్స్ కూడా ముద్దాయేనంటూ ఆయ‌న శ‌నివారం రాత్రి ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు.

జ‌గ‌న్‌పై న‌మోదైన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ కేసుల్లో నిందితుల జాబితాను త‌న ట్వీట్‌కు జ‌త చేసిన అమ‌ర్నాథ్ రెడ్డి... జ‌గ‌న్ కేసుల్లో మంత్రి డెవ‌ల‌ప‌ర్స్ 25వ ముద్దాయి అంటూ పేర్కొన్నారు. రూ.5 కోట్ల రుణాన్ని ఎగ‌వేసిన వ్య‌వ‌హారానికి సంబంధించి 2002లోనే మంత్రి డెవ‌ల‌ప‌ర్స్‌పై ఈడీ కేసు న‌మోదు చేయ‌గా... శ‌నివారం ఆ సంస్థ డైరెక్ట‌ర్ సుశీల్ పీ మంత్రిని అధికారులు అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే.
N Amarnath Reddy
TDP
Enforcement Directorate
YS Jagan
Mantri Developers
Sushil P Mantri

More Telugu News