బాల్ థాకరే పేరు వాడొద్దు: రెబెల్స్ కు శివసేన వార్నింగ్

25-06-2022 Sat 17:05
  • తమ గ్రూపుకు 'శివసేన బాలాసాహెబ్' పేరు పెట్టుకున్న రెబెల్స్
  • రెబెల్స్ ఎవరూ బాల్ థాకరే పేరు వాడరాదంటూ శివసేన సమావేశంలో తీర్మానం
  • ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే అధికారాన్ని థాకరేకు కట్టబెట్టిన నేతలు
Dont use Bal Thackeray name warns Shiv Sena
శివసేనలో పుట్టిన ముసలం కారణంగా అక్కడి రాజకీయాలు ఊహించని మలుపులు తీసుకుంటున్నాయి. ఏక్ నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన రెబెల్స్ తమ గ్రూపుకు 'శివసేన బాలాసాహెబ్' అనే పేరు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో శివసేన కీలక నిర్ణయం తీసుకుంది. రెబెల్ నేత షిండే సహా ఏ ఒక్క రెబెల్ ఎమ్మెల్యే కూడా బాల్ థాకరే పేరును వాడరాదని ఉద్ధవ్ థాకరే అధ్యక్షతన జరిగిన శివసేన జాతీయ కార్యవర్గ సమావేశంలో తీర్మానించారు. ఇంకోవైపు పార్టీని కాపాడుకునేందుకు ఉద్ధవ్ థాకరే ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే అధికారాన్ని కట్టబెట్టారు.

ఈ సందర్భంగా రెబెల్ ఎమ్మెల్యేలకు ఉద్ధవ్ థాకరే సవాల్ విసిరారు. దమ్ముంటే రాజీనామాలు చేసి ఎన్నికలకు రావాలని ఛాలెంజ్ చేశారు. మీ తండ్రుల పేరుతో ప్రచారం చేసుకుని గెలవాలని వ్యాఖ్యానించారు. బాల్ థాకరే పేరు వాడొద్దని హెచ్చరించారు.