ఆ చారల్ని చూసుకుని విజయసాయిరెడ్డి పులిలా ఫీల్ అవడంలో తప్పులేదు: అయ్యన్న సెటైర్

  • అయ్యన్న, విజయసాయి మధ్య ట్విట్టర్ వార్
  • దమ్ముంటే నర్సీపట్నం రావాలన్న అయ్యన్న
  • టైమ్, డేట్ చెప్పాలన్న విజయసాయి
  • నువ్వు పులివైతే సింగిల్ గా రావాలన్న అయ్యన్న
Ayyanna Patrudu satires on Vijayasaireddy

టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం కొనసాగుతోంది. దమ్ముంటే నర్సీపట్నం రావాలని అయ్యన్న సవాల్ విసరగా, విజయసాయి స్పందించారు. డేట్, టైమ్ చెప్పు... వస్తా అంటూ ట్వీట్ చేశారు. "అయితే, నువ్వు అజ్ఞాతంలోకి పోయావట కదా! ఎప్పుడూ భయపడే పిల్లి... పులి కన్నా తానే గొప్ప అనుకుంటుంది" అని వెటకారం ప్రదర్శించారు. దీనిపై అయ్యన్నపాత్రుడు ఘాటుగా బదులిచ్చారు. 

16 నెలలు చిప్పకూడు తినడం వల్ల శరీరం మందపడిందని ఎద్దేవా చేశారు. తోటి ఖైదీలు, ఖాకీల చేతిలో తిన్న దెబ్బల వల్ల ఏర్పడిన చారలు చూసుకుని విజయసాయిరెడ్డి పులిగా ఫీల్ అవ్వడంలో తప్పులేదని వ్యంగ్యం ప్రదర్శించారు. బెయిల్ కోసం ప్రత్యేక హోదా తాకట్టు పెట్టడానికి ఢిల్లీ వెళ్లిన నువ్వు... నన్ను అజ్ఞాతంలో ఉన్నావనడం విడ్డూరంగా ఉందని అయ్యన్న విమర్శించారు.

"నీ ప్రభుత్వ సమాచార వ్యవస్థ అంత గొప్పగా ఉంది. నేను నర్సీపట్నంలోనే ఉన్నాను... ముహూర్తం ఎందుకు? నువ్వు ఎప్పుడొచ్చినా నేను రెడీ... అన్నట్టు పులి అయితే పోలీసుల్ని వేసుకుని రాదుగా... సింగిల్ గా రావాలి... అప్పుడు తేలిపోద్ది ఎవడు పులో, ఎవడు పిల్లో!" అంటూ సవాల్ విసిరారు.

More Telugu News