indians: భారతీయుల పెట్టుబడుల్లో అత్యధికం రియల్టీలోనే..!

  • 2022 మార్చి నాటికి మొత్తం పెట్టుబడులు 10.7 ట్రిలియన్ డాలర్లు
  • ఇందులో 49.4 శాతం ప్రాపర్టీల్లో..
  • ఫిక్స్ డ్ డిపాజిట్లు, బంగారంలో చెరో 15 శాతం
  • బీమా సాధనాల్లో 6 శాతానికిపైగా పెట్టుబడులు
  • వెల్లడించిన బ్రోకరేజీ సంస్థ జెఫరీస్
Not gold or bank FD Jefferies finds this asset as top investment by Indians

మన దేశ వాసుల ఆస్తులు ఎందులో ఎక్కువగా ఉంటున్నాయని అనుకుంటున్నారు..? బ్యాంకు ఎఫ్ డీల్లో లేదంటే బంగారం అని అనుకుంటున్నారా..? కానే కాదు. రియల్ ఎస్టేట్ లో ఉంటున్నాయని బ్రోకరేజీ సంస్థ జెఫరీస్ పేర్కొంది. 2022 మార్చి నాటికి భారతీయుల పెట్టుబడుల్లో సగం రియల్ ఎస్టేట్ లోనే ఉన్నట్టు ఈ సంస్థ గణాంకాలతో ఓ నివేదికను విడుదల చేసింది.

రియల్ ఎస్టేట్ తర్వాత ఎక్కువ పెట్టుబడులను బ్యాంకు ఫిక్స్ డ్ డిపాజిట్లలో (ఎఫ్ డీలు) కలిగి ఉన్నారు. ఆ తర్వాత బంగారం వంతు. గణాంకాల వారీగా చూస్తే.. 2022 మార్చి నాటికి భారతీయుల (వ్యక్తుల)కు చెందిన 10.7 ట్రిలియన్ డాలర్ల ఆస్తుల్లో.. 49.4 శాతం ఆస్తులు రియల్ ఎస్టేట్ ప్రాపర్టీల్లో, 15.10 శాతం బ్యాంకు డిపాజిట్లలో, 15 శాతం బంగారంలో ఉన్నాయి. 6.20 శాతం పెట్టుబడులను బీమా ఉత్పత్తుల రూపంలో కలిగి ఉన్నారు.

ఇక ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ ఫండ్స్ లో 5.7 శాతం, ఈక్విటీల్లో 4.8 శాతం, నగదు రూపంలో 3.5 శాతం ఆస్తులు ఉన్నట్టు జెఫరీస్ నివేదిక తెలియజేసింది. మన దేశ వాసులు ఎంతో కొంత నగదు రూపంలో ఉంచుకోవడం సహజమే.

More Telugu News