COVID19: దేశంలో కొత్తగా 15 వేల కరోనా కేసులు.. 20 మంది మృతి

India reports 15940 fresh cases and 20 deaths in the last 24 hours
  • మొన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య కాస్త తగ్గుదల
  • రోజువారీ పాజిటివిటీ రేటు 4.39 శాతం
  • ప్రస్తుతం 91, 779 యాక్టివ్ కేసులు
దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో 15,940 కొత్త కేసులు నమోదయ్యాయి. మొన్నటితో పోలిస్తే పాజిటివ్ కేసులు కాస్త తగ్గినప్పటికీ వరుసగా రెండు రోజుల పాటు 15 వేల పైచిలుకు కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.39 శాతంగా ఉంది. దేశంలో ప్రస్తుతం 91,779 క్రియాశీల కేసులు ఉన్నాయి. క్రియాశీల రేటు 0.21 శాతంగా ఉంది. 

కరోనా వల్ల గత 24 గంటల్లో 20 మంది చనిపోయారు. దాంతో, కరోనాతో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 5,24,974కి చేరింది. మరణాల రేటు 1.21 శాతంగా నమోదైంది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4, 27,61,481కి చేరుకుంది. కరోనా బారిన పడినవారిలో 98.58 శాతం కోలుకుంటున్నారు. 

ఇక గడచిన 24 గంటల్లో 15,73,341 కరోనా వ్యాక్సిన్ డోసులు అందజేశారు. దాంతో, దేశ వ్యాప్తంగా ఇప్పటిదాకా 196.94 కోట్ల పైచిలుకు వ్యాక్సిన్లు అందజేసినట్లయిందని కేంద్రం వెల్లడించింది.
COVID19
daily cases
fresh cases
20 deaths
15940 fresh cases

More Telugu News