రాష్ట్రపతి ఎన్నికల్లో నాకు మద్దతివ్వండి: మోదీకి యశ్వంత్ సిన్హా ఫోన్

  • అద్వానీ, రాజ్ నాథ్, సొరేన్ లకు సిన్హా ఫోన్
  • సిన్హాకు మద్దతు ప్రకటించిన సమాజ్ వాది పార్టీ
  • జేడీఎస్, జేఎంఎంలు ముర్ముకు మద్దతు ప్రకటించే అవకాశం
Yashwant Sinha asked for Modi support in presidential elections

రాష్ట్రపతి ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఎన్డీయే తరపున ద్రౌపది ముర్ము, విపక్షాల తరపున యశ్వంత్ సిన్హా ఎన్నికల బరిలో నిలిచారు. వీరిద్దరూ ఇప్పటికే వివిధ పార్టీల అధినేతలతో మాట్లాడుతూ మద్దతివ్వాలని కోరుతున్నారు. తాజాగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. తనకు మద్దతివ్వాలని కోరుతూ ప్రధాని మోదీకి విపక్షాల అభ్యర్థి సిన్హా ఫోన్ చేశారు. మోదీతో పాటు బీజేపీ కురువృద్ధుడు అద్వానీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ లకు కూడా ఆయన ఫోన్ చేశారు. 

మరోవైపు ముర్ముకు మద్దతు ప్రకటించాలనే యోచనలో సొరేన్ ఉన్నట్టు తెలుస్తోంది. ముర్ము, సొరేన్ ఇద్దరూ సంతాల్ అనే ఒక గిరిజన తెగకు చెందిన వారు కావడం గమనార్హం. మరోవైపు జేడీఎస్ కూడా ముర్ముకు మద్దతు ప్రకటించే అవకాశం ఉంది. సమాజ్ వాది పార్టీ మాత్రం యశ్వంత్ సిన్హాకు మద్దతిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలలో జరిగిన సమావేశంలో సిన్హాకు మద్దతివ్వాలని అఖిలేశ్ యాదవ్ నిర్ణయం తీసుకున్నారు.

More Telugu News