కాంగ్రెస్ సీనియ‌ర్ నేత సుబ్బరామిరెడ్డి ఇప్పుడెలా ఉన్నారో చూశారా?

24-06-2022 Fri 21:59
  • చాలా కాలంగా బయట క‌నిపించ‌ని సుబ్బరామిరెడ్డి
  • తాజాగా సీడ‌బ్ల్యూసీ శాశ్వ‌త ఆహ్వానితుడిగా నియామ‌కం
  • సీనియ‌ర్ మోస్ట్ నేత‌కు గ్రీటింగ్స్ చెప్పిన గీతారెడ్డి
  • సుబ్బరామిరెడ్డి తాజా ఫొటోను షేర్ చేసిన మాజీ మంత్రి
J Geeta Reddy greets senior leader T Subbiram Reddy
కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలుగు రాష్ట్రాల‌కు చెందిన నేత‌ల్లో కీల‌క నేత‌గా ఎదిగిన టి.సుబ్బరామిరెడ్డి గుర్తున్నారు క‌దా. చాలా కాలంగా అస‌లు బ‌య‌ట క‌నిపించ‌డ‌మే మానేసిన సుబ్బరామిరెడ్డిని ఇటీవ‌లే కాంగ్రెస్ పార్టీ త‌న అత్యున్న‌త నిర్ణాయ‌క విభాగం కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ (సీడ‌బ్ల్యూసీ) శాశ్వ‌త ఆహ్వానితుడిగా నియ‌మించింది. 

ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపేందుకు పార్టీకి చెందిన మ‌రో సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి గీతారెడ్డి శుక్ర‌వారం ఆయ‌న ఇంటికి వెళ్లారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ను అభినందిస్తున్న ఫొటోను ఆమె సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో సుబ్బరామిరెడ్డి అస‌లు గుర్తు ప‌ట్ట‌లేనంత‌గా మారిపోయారు.