జ‌ల్ల‌య్య‌పై టీడీపీ హ‌యాంలో 10 కేసులు పెట్టారు: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఆరోప‌ణ‌

24-06-2022 Fri 21:43
  • గురువారం జ‌ల్ల‌య్య కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన లోకేశ్
  • లోకేశ్ వ్యాఖ్య‌ల‌పై విరుచుకుప‌డ్డ పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి
  • జ‌ల్ల‌య్య‌పై టీడీపీ హ‌యాంలో న‌మోదైన కేసుల ప్ర‌స్తావ‌న‌
  • టీడీపీని దొంగిలించిన దొంగ‌లంటూ చంద్ర‌బాబు. లోకేశ్‌ల‌పై ఘాటు వ్యాఖ్య‌లు
ysrcp mla pinnelli ramakrishna reddy fires on nara lokesh and chandrababu
వైసీపీ శ్రేణుల దాడిలో చ‌నిపోయాడ‌ని టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్న జల్ల‌య్యకు సంబంధించి వైసీపీ కీల‌క నేత‌, ప‌ల్నాడు జిల్లా మాచ‌ర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి శుక్ర‌వారం సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టారు. జ‌ల్ల‌య్య‌పై టీడీపీ హయాం (2014 నుంచి 2019)లో ఏకంగా 10 కేసులు పెట్టార‌ని పిన్నెల్లి ఆరోపించారు. ఈ మేర‌కు గురువారం జ‌ల్ల‌య్య కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన సందర్భంగా టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై తాజాగా శుక్ర‌వారం పిన్నెల్లి స్పందించారు. 

టీడీపీ హ‌యాంలో 10 కేసులు న‌మోదైన జ‌ల్ల‌య్య కుటుంబాన్ని ప‌రామ‌ర్శించ‌డానికి ఎలా వ‌చ్చారంటూ లోకేశ్‌ను పిన్నెల్లి ప్ర‌శ్నించారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తారన్న పిన్నెల్లి... వీటిని ప్రోత్సహిస్తే టీడీపీకి మొన్నటి ఎన్నికల్లో వచ్చిన 23 సీట్లకి ఈసారి 3 సీట్లు కూడా రావని హెచ్చ‌రించారు. త‌మ‌ బయోడేటాలోనే భయమన్నది లేదని లోకేశ్ అంటున్నార‌న్న పిన్నెల్లి.. అసలు మీ తండ్రీ కొడుకుల బతుకులకి ఒక బయోడేటా ఉందా? అని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. 

టీడీపీని దొంగిలించిన దొంగలు మీరంటూ లోకేశ్‌, చంద్ర‌బాబుల‌పై పిన్నెల్లి విరుచుకుప‌డ్డారు. చివరికి ఎన్టీఆర్‌ ట్రస్టుకి చెందిన ఆస్తులను కూడా దోచిన దొంగలు మీరని ఆయ‌న తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలో మీకు ఆధార్ కూడా లేదన్న పిన్నెల్లి...హైదరాబాదు నుండి చుట్టం చూపుగా ఏపీకి వచ్చే టూరిస్టులు మీరంటూ సెటైర్లు సంధించారు. పౌరుషానికి మారుపేరుగా ప్రజలకు ఇచ్చిన మాటను జ‌గ‌న్ నిలబెట్టుకుంటున్నారన్న పిన్నెల్లి... చంద్ర‌బాబు, లోకేశ్‌లు సీమలో పుట్టిన గ్రామ సింహాలు మాత్రమేన‌ని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.