యంగ్ అదానీ ఫొటోతో భ‌ర్త‌కు బ‌ర్త్ డే గ్రీటింగ్స్ చెప్పిన ప్రీతి అదానీ

24-06-2022 Fri 20:41
  • నేడు 60వ జ‌న్మ‌దినాన్ని జ‌రుపుకుంటున్న గౌతం ఆదానీ
  • భ‌ర్త‌కు మ‌రిచిపోలేని రీతిలో విషెస్ చెప్పిన ప్రీతి అదానీ
  • 36 ఏళ్ల క్రితం త‌మ పెళ్లి జ‌రిగిందంటూ వెల్ల‌డి
gautam adani gets memorable birth day wishes fromhis wife
అదానీ గ్రూప్ అధినేత గౌతం అదానీ బ‌ర్త్ డేను పుర‌స్క‌రించుకుని శుక్ర‌వారం ఆయ‌న భార్య ప్రీతి అదానీ ఆయ‌న‌కు వినూత్నంగా శుభాకాంక్ష‌లు తెలిపారు. అదానీ యుక్త వ‌య‌సులో తీయించుకున్న ఫొటోను షేర్ చేస్తూ ఆమె అదానీకి బ‌ర్త్ డే విషెస్ చెప్పారు. ఈ సంద‌ర్భంగా త‌న కెరీర్‌, అదానీతో త‌న వివాహం, అదానీ క‌ల‌లు గురించి ఆమె ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

36 ఏళ్ల క్రితం త‌న కెరీర్‌ను ప‌క్క‌న‌పెట్టేసి గౌతంతో కొత్త ప్ర‌యాణాన్ని మొద‌లుపెట్టాన‌ని ప్రీతి పేర్కొన్నారు. ఇప్పుడు వెన‌క్కు తిరిగి చూసుకుంటే.. త‌న‌కు చాలా గౌర‌వంగానే కాకుండా గ‌ర్వంగానూ ఉంద‌ని ఆమె తెలిపారు. 60వ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా గౌతంకు మంచి ఆరోగ్యం ఇవ్వాల‌ని దేవుడిని ప్రార్థిస్తున్నాన‌ని, గౌతం క‌న్న క‌ల‌లన్నీ నెర‌వేరాల‌ని ఆమె ఆకాంక్షించారు.