నందమూరి బాల‌కృష్ణ‌కు క‌రోనా... స్వ‌యంగా ప్ర‌క‌టించిన బాలయ్య

24-06-2022 Fri 17:43
  • కరోనా బారిన పడ్డానన్న బాలకృష్ణ 
  • పూర్తి ఆరోగ్యంగానే ఉన్నాన‌ని వెల్లడి  ‌
  • త‌న‌ను క‌లిసిన వారు ప‌రీక్ష‌లు చేయించుకోవాలని సూచ‌న‌
tdp mla balakrishna tests positive for corona
టాలీవుడ్ అగ్ర హీరో, టీడీపీ నేత‌, హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ మేర‌కు బాల‌కృష్ణ స్వ‌యంగా ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించారు. తాను క‌రోనా బారిన ప‌డ్డాన‌ని, అయినా కూడా తాను పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. గ‌డ‌చిన రెండు రోజుల్లో త‌న‌ను క‌లిసిన వారంద‌రూ ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా కరోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని ఆయ‌న కోరారు.